CM Chandrababu: ఈ రోజు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సమావేశంకానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగనుంది.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలుపై నీతి ఆయోగ్ సీఈవో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు.. ఇక, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి సంబంధించిన చెక్కును ఆయిల్ కంపెనీలకు అందజేయనున్నారు సీఎం చంద్రబాబు.. కాగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. దీపావాళి సందర్భంగా మరో పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.. రేపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.. ఇప్పటికే నిన్నటి నుంచి సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైన విషయం విదితమే..
CM Chandrababu: నేడు నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు భేటీ..
- నేడు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం చంద్రబాబు భేటీ..
- సచివాలయంలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సమావేశం..
- కేంద్ర ప్రభుత్వ పథకాలు.. వాటి అమలుపై చర్చ..