NTV Telugu Site icon

CM Chandrababu: మూడు శాఖలపై సీఎం సమీక్ష.. ధరల నియంత్రణ కోసం తీసుకున్న చర్యలపై ఆరా

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు.. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు.. అయితే, నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు..

Read Also: Visvambhara : గూస్ బంప్స్ తెప్పించిన విశ్వంభర టీజర్.. ఇది వేరే లెవల్

మరోవైపు.. డిమాండ్ కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు.. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా చేపట్టిన వివిధ అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. కాగా, క్రమంగా కూరగాయలు, వంటనూనెలు.. ఇలా అన్ని వస్తువుల ధరలు పైపైకి కదులుతోన్న సమయంలో.. టమోటాలు, ఉల్లిగడ్డ, వంటనూనెలు.. ఇలా కొన్నింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్కువ ధరకే అందిస్తోన్న విషయం విదితమే. . ప్రతి రేషన్‌ కార్డుదారునికి మూడు లీటర్ల పామాయిల్‌, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయిస్తున్నారు.. పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.110, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.124కు అందిస్తోన్న విషయం తెలిసిందే.

 

 

 

Show comments