NTV Telugu Site icon

CM Chandrababu: శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారు..

Cbn 2

Cbn 2

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ముందుగా నిర్ణయించిన ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటనను ఆకస్మికంగా రద్దు చేశారు.. అయితే, ఇదే సమయంలో ప్రకాశం జిల్లా పర్యటనను ఖరారు చేశారు.. దీంతో. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. నాగులప్పలపాడు మండలంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించనున్నారు..

Read Also: Lalitha Sahasranama Stotram: సుభాలు కలగాలంటే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం వినండి..

ఇక, ప్రకాశం జిల్లా పర్యటన కోసం.. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో చదలవాడలోని శ్రీ విష్ణు విల్లాస్ లో ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతరం మద్దిరాలపాడులో కొన్ని నివాసాలకు వెళ్లి ప్రజలను కలుస్తారు. అనంతరం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద గ్రామసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. మరోవైపు.. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.. కాగా, వరుసగా వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు జిల్లా పర్యటనలపై కూడా ఫోకస్ పెట్టారు.. ఇక, వరద బాధిత ప్రాంతాల్లో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులను.. సిబ్బందిని దగ్గర ఉండి సీఎం పనిచేయించిన విషయం విదితమే..

Show comments