AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, తాజా పరిపాలనా అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.
ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు.. కూటమి పార్టీల మధ్య కూడా సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతోన్న విషయం విదితమే.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!