Site icon NTV Telugu

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. అజెండాలోని 14 అంశాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గ సమావేశం.. ముఖ్యంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పు చేర్పుల నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. కేడర్ రేషనలైజేషన్ పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ.. పౌరసేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా కేడర్ లో మార్పు చేర్పులకు నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది..

Read Also: Jio Recharge Plan: 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్‌లతో అద్భుతమైన ప్లాన్

మరోవైపు, కుప్పం నియోజకవర్గంలో రూ.5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుపై వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.. సెంట్రల్ పూల్ లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం కేబినెట్ కు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు సమర్పించగా.. వాటికి ఆమోదముద్ర వేసింది.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్‌ నిర్మాణం కోసం ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. మరోవైపు, రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి ఉచితంగా 10 ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. గీతకులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాల్ని సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను ఆమోదించింది కేబినెట్ . 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది..

Exit mobile version