Site icon NTV Telugu

AP Cabinet Decisions: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు చంద్రబాబు.. విశాఖ ముంబై తరహాలో అభివృద్ధి చెందుతోంది.. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.. కేబినెట్‌లో ఏఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి గ్రౌండ్ అయ్యేలా సమన్వయం చేసుకోవాలి.. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు.. రాజకీయంగాను వాటి ఫలాలు ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Hyderabad : హైదరాబాద్‌లో బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ.. పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

అయితే, మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు మత్రి కొలుసు పార్థసారథి.. కాగా, లక్షా 14 వేల 824 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది.. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏకి ఇచ్చేందుకు ఆమోదించగా.. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టుగా సమాచారం.. ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపుల‌ అంశంలో నిర్ణయం తీసుకున్నారని.. ఉద్యోగుల డీఏకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది..

Exit mobile version