AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. మరోవైపు.. తాజాగా జరిగిన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ, సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
Read Also: Ajith : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ..
మరోవైపు, తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రధాని మోడీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది. కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.. తీర ప్రాంత భద్రత ఇతర అంశాలపై చర్చ జరిగింది.. అనుకోని సంఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు సీఎం.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు వర్చువల్ గా.. ఈ సమావేశానికి హాజరు అయ్యారు. సీఎస్ విజయానంద్.., డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. వివిధ శాఖల అధికారులు.. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, టూరిజం, ఎండోమెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్త్, ఆర్ అండ్ బీతో పాటు పలు శాఖల అధికారుల ఈ సమావేశానికి హాజరైన విషయం విదితమే..
