AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 65కి పైగా ఎజెండా అంశాల అజెండాతో సాగిన ఈ సమావేశంలో 65కి పైగా అంశాలను ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. వైజాగ్ లో ఈ నెలలో జరగబోయే సీఐఐ సమ్మిట్‌కు సంబంధించి చర్చ సాగింది.. క్వాoటం పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఇక, మొంథా తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలపై మంత్రులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు, పార్టీ కార్యాలయాల లీజ్ కు సంబంధించి చట్ట సవరణకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..
మరోవైపు, కేబనెట్ సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వైజాగ్ సమిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు.. ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలని తెలిపారు.. ఇక, మరోసారి చర్చకు వచ్చింది ఎమ్మెల్యే ల వ్యవహారం..జిల్లా మంత్రులు.. ఎమ్మెల్యేలు ఏ విధంగా నడుచుకోవాలని చెప్పాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యేల బాధ్యత మీది.. వివాదాలు లేకుండా చూసుకోవడంపై జిల్లా మంత్రులు దృష్టి పెట్టాలన్న ఆదేశించారు.. అయితే, ఎమ్మెల్యే ల వ్యవహార శైలిపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. జిల్లా మంత్రులు.. ఎమ్మెల్యే ల బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
