Site icon NTV Telugu

AP Cabinet: అమరావతిలో మలివిడత భూసేకరణ.. కేబినెట్‌ కీలక నిర్ణయం

Cabinet

Cabinet

AP Cabinet: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గంలో చర్చించారు.. అయితే, తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. మరోవైపు, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇంఛార్జ్‌ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని.. మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు.. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చు అని స్పష్టం చేశారు సీఎం.. అయితే, సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు చంద్రబాబు.. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా మరోసారి చెప్పారు ముఖ్యమంత్రి..

Read Also: Chiranjeevi: మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!

ఇక, కూటమి ఏడాది విజయాలు ఎమ్మెల్యేలు జులై 1వ తేదీ నుంచి ఇంటింటికీ తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు.. ప్రతీ నియోజవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం.. అన్న కాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు, స్వర్ణాంధ్ర పీ4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయాలి.. జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు చైర్మన్ గా జిల్లాల్లో.. ఎమ్మెల్యే చైర్మన్ గా నియోజకవర్గ పరిధిలో ఈ కమిటీలు ఉండాలి.. ఈ నెలాఖరులోగా కమిటీల ఏర్పాటు.. మొదటి సమావేశం పూర్తి అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..

Exit mobile version