NTV Telugu Site icon

AP Cabinet key Decision: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. పోలవరంపై కీలక నిర్ణయం

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet key Decision: సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది కేబినెట్‌ భేటీ.. దీంతో.. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను కొత్తగా నిర్మించనుంది ప్రభుత్వం. ఇక, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదించనుంది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రం వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నీతి ఆయోగ్ లో ప్రతిపాదనలు పెట్టే ముందు ఏపీ కేబినెట్ ఆమోదం తప్పనిసరి అయిన నేపథ్యంలో.. ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఆమోదం తెలిపింది కేబినెట్‌ సమావేశం.. కాగా, పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.. గతంలో జరిగిన పనులు.. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితిపై ఆరా తీశారు.. ఇక, పోలవరంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన విషయం విదితమే. గత.. ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా ఎండగట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.