Site icon NTV Telugu

AP Cabinet Key Decision: 24 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Key Decision: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మొత్తం 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరిగింది.. వాటిపై చర్చించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది మంత్రి మండలి.. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో చర్చ సాగింది.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్ కు నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది.. ఇక, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది..

Read Also: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు ఐసీసీ అవార్డు.. మొదటి భారత ఆటగాడిగా..!

ఇక, సీఆర్డీఏ 46 ఆథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌.. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భ‌వ‌నాల టెండ‌ర్లకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఎల్ వ‌న్ గా నిలిచిన సంస్థల‌కు లెట‌ర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. రూ.617 కోట్లతో అసెంబ్లీ బేస్ మెంట్ + జీ + 3 + వ్యూయింగ్ ప్లాట్ ఫాంలు + ప‌నోర‌మిక్ వ్యూ(బిల్టప్ ఏరియా 11.22 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగులు, ఎత్తు 250 మీట‌ర్లు) అసెంబ్లీ నిర్మాణానికి టెండ‌ర్లలో ఎల్ వ‌న్ గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది.. రూ.786 కోట్లతో హైకోర్టు బేస్ మెంట్ + జీ + 7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగులు ఎత్తు 55 మీట‌ర్లు.. ఎల్ వ‌న్ గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం లభించింది.. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్సైపీబీ) 5వ సమావేశం నిర్ణయాలను ఆమోదించింది మంత్రివర్గం.. 30, 667 కోట్ల పెట్టుబలతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల ఎస్ఐపీబీలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. వీటి ద్వారా 32133 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Exit mobile version