AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజా అవసరాలు, పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Indonesia: ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధాశ్రమంలో 16 మంది సజీవదహనం
కేబినెట్‌కీలక నిర్ణయాలు..
* జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపింది కేబినెబ్.. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* రాజంపేట ఇకపై కడప జిల్లాలో ఉండనుంది.. ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
* రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాకు రుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా పరిధిలోకి మార్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
* 3 కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నాయి.. కేబినెట్ సమావేశంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.
* గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ప్రజా పాలనకు మరింత దగ్గర చేస్తుందని అధికారులు తెలిపారు.
* 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం పెంచేందుకు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక, కేబినెట్ ఆమోదం అనంతరం తుది గెజిట్ నోటిఫికేషన్‌ను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గెజిట్‌తో జిల్లాల మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. దీంతో, జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో స్పష్టం చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు స్థానిక అభివృద్ధి, పాలనా సమన్వయానికి కీలకంగా మారనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వేగం పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
