NTV Telugu Site icon

AP Assembly Budget Session: ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రేపు స్పీకర్‌ కీలక భేటీ

Ap Assembly

Ap Assembly

AP Assembly Budget Session: ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది.. సభ ఎన్ని రోజులు పాటు నిర్వహించాలి అనేది బీఏసీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు.. ఇక, 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంది ప్రభుత్వం… తర్వాత రెండు రోజుల పాటు సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయి.. 26 శివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. 28 ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం అవుతుంది.. బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది..

Read Also: Belagavi: మరాఠీ మాట్లాడనందుకు బెళగావిలో కండక్టర్‌పై దాడి..

ఇక, ఆ తర్వాత అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు అసెంబ్లీలో వివరించనుంది ఏపీ సర్కార్‌.. సంక్షేమం, అభివృద్ధి.. 8 నెలల పాలనపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.. 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నుంచి కూడా సభ్యుల హాజరు కూడా ఎక్కువగా ఉండాలని సీఎం చెబుతున్నారు. మరోవైపు.. రేపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు కల్పించ వలసిన భద్రతపై డీజీపీ, ఇతర పోలీస్ అధికారులతో స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతతో పాటు అసెంబ్లీ బయట శాంతి భద్రతల పై సమీక్ష నిర్వహించనున్నారు స్పీకర్.. గవర్నర్ అసెంబ్లీ కి వచ్చిన దగ్గర్నుంచి తిరిగి రాజ్ భవన్ కు వెళ్లే వరకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై స్పీకర్ రేపు సమీక్ష చేయనున్నారు.. గవర్నర్ రాకకు సంబంధించి. రేపు అసెంబ్లీ ప్రాంగణం వరకు కాన్వాయ్ రిహార్సల్‌ జరగనుంది..