Site icon NTV Telugu

Andhra Pradesh: సిస్కోతో ఏపీ ఒప్పందం.. ఐటీ, అడ్వాన్స్‌డ్‌ కోర్సులో 50 వేల మందికి శిక్షణ..

Cisco

Cisco

Andhra Pradesh: కూటమి ప్రభుత్వంలో ఐటీ, విద్యాశాఖల బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. విద్యారంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మంత్రి నారా లోకేష్‌.. ఇప్పటికే పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోగా.. ఇప్పుడు ఐటీ, అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.. దీని కోసం సిస్కోతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో – ఏపీఎస్ఎస్ డీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.. ఒప్పందం ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు..

Read Also: Meerut Murder: భార్య గొంతు కోసింది, లవర్ తల నరికాడు.. మీరట్ హత్యలో భయంకర నిజాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నత, వృత్తివిద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు మంత్రి నారా లోకేష్‌.. ఉండవల్లి తన నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ను సిస్కో అందిస్తుందని.. ఈ ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యంగా ట్వీట్‌ చేశారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version