NEET-Based Nursing Admissions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో నర్సింగ్ ప్రవేశాలను NEET-UG పరీక్ష ఆధారంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ మార్గాన్ని అనుసరించడానికి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.. 2026 – 27 విద్యాసంవత్సరంలో నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు National Eligibility cum Entrance Test (NEET-UG) రాయాల్సి ఉంటుంది. వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమావేశం చేపట్టి, నర్సింగ్ ప్రవేశాలకు ఉత్తమ విధానాన్ని రూపొందించడానికి సమీక్ష నిర్వహించారు. ఇక, ఈ నిర్ణయం రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశ ప్రక్రియను కేంద్రం ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కీలకంగా మారనుంది..
Read Also: Serial Thief: 15 ఏళ్ల పగ.. కేవలం పోలీసులు ఇళ్లను కొల్లగొట్టే దొంగ..
