Site icon NTV Telugu

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Ap Cabinet Key Decisions

Ap Cabinet Key Decisions

AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర కేబినెట్‌ ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. భారీ పెట్టుబడులకు, స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు మార్గం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. రాబోయే 30 ఏళ్ల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ ఇండస్ట్రీస్, విమానాశ్రయం, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. భూమికి నిజమైన విలువ రావాలంటే పరిశ్రమలు, ఐటి పార్కులు, గ్లోబల్ స్థాయి అభివృద్ధి అవసరం ఉందని పేర్కొన్నారు.

Read Also: Local Body Elections : ఎస్సీ రిజర్వేషన్ జాక్‌పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక

ఇక, ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు నారాయణ.. రాజధానిలో ముందుగా చేపట్టిన వ్యవస్థ ప్రకారం 16,666.75 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేపడతామని, ముందుగా ఇచ్చిన అన్ని ప్రయోజనాలు మళ్లీ యథావిధిగా వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం సమీకరించబోయే భూముల్లో.. ఎయిర్‌పోర్ట్ – 5,000 ఎకరాలు, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.

కేంద్ర బ్యాంకుల పెట్టుబడులతో అమరావతి ఆకర్షణ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 15 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌ల శంఖుస్థాపన చేసిన విషయం అమరావతికి ఆర్థిక హబ్‌గా గుర్తింపు వస్తోందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. అమరావతిలో యూనివర్సిటీలు, హోటల్ ప్రాజెక్టులు, రవాణా సదుపాయాలు వంటి మౌలిక వసతులకు ఇప్పటికే భూములు కేటాయించినట్టు తెలిపారు. మొత్తంగా అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగు పడినట్టు అయ్యింది.. 16,666 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ఆమోదం లభించగా.. రైతులకు పాత ప్రయోజనాలే కొనసాగించనున్నారు.. స్పోర్ట్స్ సిటీ, ఎయిర్‌పోర్ట్, రింగ్ రోడ్లు, రైల్వే స్టేషన్ ప్రణాళిక రూపొందిస్తున్నారు..

Exit mobile version