Group-1 Officers Transfer: హైకోర్టు సీరియస్‌.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Ap High Court

Ap High Court

Group-1 Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో 2018 గ్రూప్-1 పరీక్షల ఆధారంగా జరిగిన అధికారుల బదిలీలపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్, 2018 గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విచారణ పూర్తయ్యే వరకు, ఎంపికైన అధికారులందరిని అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న 26 మంది అధికారులను General Administration Department (GAD)కు అటాచ్ చేసే ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.. కుప్పం RDO సహా రాష్ట్రంలోని ఇతర RDOలను బదిలీ చేయడం.. ఎంపికైన అధికారుల ప్రాధాన్యతని సమీక్షించి, అవసరమైతే అప్రాధాన్య పోస్టులో నియమించడం చేసింది.. 2018 కి చెందిన గ్రూప్ 1 అధికారును బదిలీ చేసింది.. హైకోర్టు ఆదేశాలతో ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న 26 మందిని GAD కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కారు.. కుప్పం ఆర్ డీ ఓ తో సహా రాష్ట్రంలోకి కీలక డివిజన్ ల RDO లను బదిలీ చేసింది. ప్రభుత్వం…ఇదే అంశంపై ఏపీ సీఎస్‌ పై హై కోర్ట్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. కోర్ట్ చెప్పినా ఎందుకు ప్రాధాన్య పోస్ట్ ల్లో ఉంచారని సీఎస్ ను ప్రశ్నించింది. దీంతో… సీఎస్ ఆదేశాలతో జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం..

హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైకోర్టు, ఆదేశాలు పాటించని కారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)ను పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఉదయాన్నే CS హైకోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.. ఆ దేశోనికి సత్ఫలితంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది.. హైకోర్టు ఆదేశాలు మరియు ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో 2018 గ్రూప్-1 అధికారుల బదిలీ వ్యవహారం అత్యంత పర్యవేక్షణలో ఉంది.