AP Anti Narcotic Task Force: ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (APNTF) విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది.. డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని పేర్కొంటోంది ఆంధ్ప్రదేశ్ ప్రభుత్వం.. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో APNTF ఏర్పాటు చేయనున్నారు.. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్.. 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోస్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది కూటమి సర్కార్.. అవసరమైన సమాచారాన్ని వివిధ విభాగాల నుంచి తీసుకునే అధికారాన్ని APNTFకు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.. కేసుల నమోదు చేసి దర్యాప్తు చేసే కీలక అధికారాలను APNTFకు ఇవ్వనుంది ప్రభుత్వం. APNTF విభాగానికి మొత్తం 724 ప్రభుత్వ, 110 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కావాలని ప్రతిపాదనలు ఉన్నాయి.. దీని అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్.. గత ప్రభుత్వ హయాంలో విచ్చిలవిడిగా గంజాయి సాగు.. సరఫరా జరిగిందని.. డ్రగ్స్ వాడకం పెరిగిపోవడానికి వారి విధానాలే కారణమని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు.. డ్రగ్స్, గంజాయి కట్టడితో పాటు నివారణ చర్యలకు పూనుకుంటుంది.
Read Also: Manish Sisodia: 17 నెలల తర్వాత భార్యతో కలిసి చాయ్ తాగిన మనీష్ సిసోడియా