NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన ప్రారంభం..!

Ap Govt

Ap Govt

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10 వేల 960 గ్రామ సచివాలయాలు, 4 వేల 44 వార్డు సచివాలయాలు ఉండగా.. దాదాపు లక్షా 61 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలు ఉన్నారు. అవసరాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం… కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. గ్రామాల్లో ఏఎన్ఎం, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్‌, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన చేస్తోంది. ఇక పట్టణ పరిధి వార్డుల్లో అడ్మిన్, శానిటరీ, విద్యా, సంక్షేమం, సౌకర్యాలు, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా సూచనలు చేసింది. మిగిలిన సెక్రటరీలను క్లస్టర్ వ్యవస్థలో వివియోగించుకోనున్న ప్రభుత్వం.. గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీ రాజ్ పరిధిలోకి తెచ్చే ఆలోచనలో చేస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.. ఇప్పటికే పలు శాఖల్లో అవకతవలకపై విచారణ కొనసాగుతోన్న విషయం విదితమే..

Read Also: Wayanad landslides: వయనాడ్ బాధితులకు రూ.15 కోట్లు సాయం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్‌

Show comments