Site icon NTV Telugu

CM Chandrababu Delhi visit: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేడు అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ..

Cbn

Cbn

CM Chandrababu Delhi visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా “పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్”కు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Read Also: IND vs SA 5th T20: నేడే దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి టీ20.. ఈ సిరీస్‌ కైవసం చేసుకునేనా..?

సీఎం చంద్రబాబు నేటి ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
* ఉదయం 9.45 గంటలకు – శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో భేటీ
* ఉదయం 10.45 గంటలకు – కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశం
* ఉదయం 11.30 గంటలకు – పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
* మధ్యాహ్నం 12.15 గంటలకు – షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశం
* మధ్యాహ్నం 2.15 గంటలకు – తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగే “రియల్ ఎస్టేట్ అవార్డు ప్రదానోత్సవం”లో పాల్గొంటారు.
* సాయంత్రం 4.00 గంటలకు – పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరితో భేటీ
* సాయంత్రం 5.30 గంటలకు – కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం

ఈ భేటీల ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version