NTV Telugu Site icon

Job Notification in AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్‌ జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

Ap

Ap

Job Notification in AP: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూనే ప్రైవేట్‌ ఉద్యోగాల కల్పనపై ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం.. మరోవైపు.. ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి సారించింది.. అందులో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్‌ను ఈ రోజు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది..

Read Also: Thailand: బీచ్ ఒడ్డున ధ్యానం.. భారీ కెరటానికి కొట్టుకుపోయిన రష్యన్ హీరోయిన్.. వీడియో వైరల్

సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తారు.. బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టుల్ని పీహెచ్‌సీలు / ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.. http:apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుంది.. డిసెంబర్ 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.