Andhra Pradesh Budget: రేపే ఏపీ బడ్జెట్‌.. 10.30కి కేబినెట్‌.. 11.15కి బడ్జెట్‌ 2026-27

Ap Budget

Ap Budget

Andhra Pradesh Budget: 2026-27 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ను రేపు ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్ఱభుత్వం… రాష్ట్ర అసెంబ్లీలో ఉదయం 11:15కి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మొత్తం దాదాపు రూ.3.45–3.50 లక్షల కోట్లు ఉండే అవకాశముందని అంచనాలున్నాయి.. అయితే, బడ్జెట్‌కు ముందే.. అంటే రేపు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షనత ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్‌ 2026-27కు ఆమోదముద్ర వేయనుంది మంత్రివర్గం.. ఆ తర్వాత ఉదయం 11.10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. 11.15కి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.. శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టే అవకాశం ఉంది..

Read Also: అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!

ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమ, మరియు ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిపెట్టుకుని రూపొందించినట్టుగా తెలుస్తోంది.. ఈ బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. “సూపర్ సిక్స్” హామీలలో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతుంది ప్రభుత్వం.. ఇక, రేపు మధ్యాహ్నం 12.50 కి వ్యవసాయ ప్రత్యేక పద్దును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. శాసన మండలిలో వ్యవసాయ పద్దును మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నారు..