Site icon NTV Telugu

First Piped Gas Capital: తొలి పైప్డ్ గ్యాస్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి.. సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్..!

Piped Gas Capital

Piped Gas Capital

First Piped Gas Capital: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పునర్‌ నిర్మాణ పనులను జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెట్టించడానికి సిద్ధం అవుతోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అనుమతులు కూడా తెలిపింది.. ఈ ప్రాజెక్టుకును ఇంత మొత్తం అంటూ.. ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళ్తున్నారు.. అయితే, మొద‌టి పైప్డ్ గ్యాస్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మార్చేందుకు సిద్ధం అవుతుంది ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌ (ఐవోసీ).. దీనిపై ప్రతిపాదనలతో ముందుకొచ్చింది ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌.. గుజ‌రాత్ లోని గిఫ్ట్ సిటీ త‌ర‌హాలో పైప్డ్ గ్యాస్ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని చేస్తామంటోంది ఐవోసీ.. ఇక, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. కావాల్సిన స‌హ‌కారం అందిస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీర‌బ్‌ కుమార్ ప్రసాద్‌ తెలిపారు.. ఆర్టీజీఎస్‌లో భేటీ అయ్యారు పెట్రోలియం అండ్ నేచుర‌ల్ గ్యాస్ రెగ్యులేట‌రీ బోర్డు స‌భ్యులు ర‌మ‌ణ కుమార్‌.. రాష్ట్రంలో పైప్డ్ గ్యాస్ క‌నెక్షన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ ప‌నులపై ప్రగ‌తి గురించి ఏపీ గ్యాస్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్‌తో చ‌ర్చించారు ప్రతినిధులు..

Read Also: Haridwar: హరిద్వార్-రూర్కీ బ్రిడ్జ్‌పై ప్రమాదకర రీల్స్.. ఐదుగురు అరెస్ట్

Exit mobile version