Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- అమరావతికి భారీ బూస్ట్..
- రూ.2,500 కోట్ల సెంట్రల్ సెక్రటేరియట్‌కు కేంద్రం ఆమోదం..
- రాజధాని అభివృద్ధికి మరో మైలురాయి..
- అమరావతిలో మెగా సెక్రటేరియట్ ప్రాజెక్టు..
- కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, అమరావతిలో రూ.2,500 కోట్ల విలువైన సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి మరింత ఊతమివ్వనుంది. ప్రణాళిక ప్రకారం 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక ఆఫీస్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. ఇందులో రెండు భారీ టవర్లను ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే 1,800 కార్లకు పార్కింగ్ సదుపాయాన్ని కల్పించేలా ఆధునిక మౌలిక వసతులతో ఈ కార్యాలయ సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఇదే ప్రాజెక్టులో భాగంగా రూ.1,234 కోట్ల వ్యయంతో 17 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను కూడా నిర్మించనున్నారు. 11 టవర్లలో మొత్తం 1,568 నివాస క్వార్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు పెమ్మసాని… గ్రీన్ ఎనర్జీ వినియోగం, కమ్యూనిటీ హాల్స్, ఆధునిక సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా ఈ నివాస సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు. 2018లో తొలిసారిగా ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు పలు కారణాలతో ముందుకు సాగకపోయినా, 2024 తర్వాత వేగం పుంజుకుని ప్రస్తుతం ఆమోద దశకు చేరుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖల సమన్వయంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు లభించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం వల్లే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సాధ్యమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతిలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు రాజధాని అభివృద్ధికి కొత్త ఊపు లభించనుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
తాజావార్తలు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
-
Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!