Andhra Pradesh New Map: అమరావతి రాజధానిగా.. 28 జిల్లాలతో కొత్త మ్యాప్..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ లో 28 జిల్లాలు..
- ఏపీ రాజధాని అమరావతి పేరు పేర్కొంటూ మ్యాప్ విడుదల..
- మ్యాప్ విడుదల చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh New Map: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా నిర్మాణంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ, తాజాగా 28 జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్ర మ్యాప్ విడుదలైంది. ఈ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఈ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం.
Read Also: Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించే బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ మ్యాప్ విడుదలైంది. దీంతో అమరావతి రాజధాని హోదా మరింత బలపడినట్లైంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం జిల్లాల సంఖ్యను 28కి పెంచారు. ఈ రెండు కొత్త జిల్లాలను కూడా తాజా మ్యాప్‌లో చేర్చడం ద్వారా రాష్ట్ర భౌగోళిక నిర్మాణంలో మార్పులు ప్రతిబింబించాయి.
ఇక, అమరావతిని గుంటూరు జిల్లాలో భాగంగా చూపిస్తూ కొత్త మ్యాప్ రూపొందించడం మరో ముఖ్య అంశంగా నిలిచింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన సులభతరం చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కొత్త మ్యాప్ విడుదలతో రాష్ట్ర పరిపాలనలో స్పష్టత పెరగడమే కాకుండా, భవిష్యత్ ప్రణాళికలకు కూడా ఇది మార్గదర్శకంగా నిలవనుంది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!