Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Construction: అమరావతిలో రోడ్లు.. ప్రభుత్వ భవనాలు.. డ్రైనేజీ.. విద్యుత్.. నీటి వసతులు.. ఇతర మౌలిక వసతుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో నివేదికలు కూడా అవే చెప్తున్నాయి. కానీ, కొన్ని ప్రాజెక్టు పనులు మాత్రం కార్మికులు లేక నత్తనడకన సాగుతున్నాయన్న వాస్తవం అధికారులు దృష్టికి వచ్చింది. రాజధాని నిర్మాణంలో భాగంగా, వేల కోట్ల రూపాయల విలువైన పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే అవసరమైన స్థాయిలో కార్మికులను సైట్‌కు సమీకరించడం ఇప్పుడు కీలకంగా మారింది. అధిక సంఖ్యలో కార్మికులను సమకూర్చి పనులకు అంతరాయం లేకుండా చూడాలని ఇటీవలే ఏడీసీ సీఎండీ అధికారులను ఆదేశించడం.. కార్మికుల లభ్యత అంశం అధికారుల దృష్టిలో కూడా ఉందనే విషయాన్ని సూచిస్తోంది.
రాజధాని పనులను వేగంగా జరుపుతున్నామని చెప్పిన కాంట్రాక్టర్లు, క్రమంగా ఆ స్పీడ్ తగ్గిస్తున్నారు. దీనికి కారణం కార్మికుల కొరత అంటున్నారు. అయితే కూలీలు ఎందుకు తగ్గారనే ప్రశ్నకు అనేక సమాధానాలు వస్తున్నాయి. రాజధాని పరిధిలో అనేక భారీ ప్యాకేజీలు ఒకేసారి కదలడంతో నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న కార్మికులకు డిమాండ్ ఏర్పడింది. అలాగే వలస కార్మికులపై ఆధారపడటం మరో కారణంగా చెబుతున్నారు. గతంలో అమరావతి నిర్మాణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేశారు. అధికారిక పత్రాల్లో కూడా లేబర్ ఇన్‌ఫ్లో, లేబర్ మేనేజ్మెంట్ను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అంశాలుగా పేర్కొన్నారు. కార్మికులకు వసతి, నీరు, పారిశుద్ధ్యం, భద్రత కూడా కాంట్రాక్టర్ బాధ్యతే. అయితే ఇవి సరిగా లేకపోవడం కూడా కార్మికులు సైట్లో కొనసాగడం కష్టంగా మారుతోంది.. మరోవైపు, ఎల్‌నినో ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లడం, లేబర్ క్యాంపుల్లో మౌలిక వసతులపై సమస్యలు ఉన్నాయని సాక్షాత్తు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ అంశాలు కూడా కార్మికుల కొరత, పనుల్లో వేగం లేకపోవడానికి కారణాలుగా తెలుస్తున్నాయి.
Also Read
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
2026 మేలోనే అమరావతిలోని లేబర్ క్యాంపులపై నిరంతర నిఘా పెట్టాలని.. కాంట్రాక్టర్లు కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఏడీసీ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు సూచించారు. 2019కు ముందు అమరావతిలో నిర్మాణ పనుల్లో 50 వేల మందికి పైగా కార్మికులు పనిచేశారు. 2019 తర్వాత నిర్మాణ కార్యకలాపాలు మందగించడంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు అమరావతిని వీడారు. ఐదేళ్ల విరామంతో అప్పట్లో పనిచేసిన కార్మికులు ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాజెక్టుల వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం అమరావతిలో రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ తదితర పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు రోజువారీగా 36 వేల మందికి పైగా కార్మికులు అవసరమవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా కార్మికులను సమీకరించడం కాంట్రాక్ట్ సంస్థలకు సవాలుగా మారింది.
వలస కార్మికులకు తగిన వసతి, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కూడా కార్మికుల కొరతలో కీలకంగా మారాయి. తీవ్రమైన ఎండ, వేడి కారణంగా నిర్మాణ ప్రదేశాల్లో పనిచేయడం కార్మికులకు కష్టంగా మారింది. కొన్ని సందర్భాల్లో వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం కూడా కార్మికుల నిలకడపై ప్రభావం చూపుతోంది. మొత్తంగా, ఒకప్పుడు 50 వేల మందికి పైగా ఉన్న పాత నిర్మాణ దశతో పోలిస్తే.. ప్రస్తుత అవసరాలకు కూడా కార్మికుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి నిర్మాణ పనులు నిర్ణీత గడువుల్లో పూర్తి కావాలంటే.. కార్మికుల సమీకరణ, వసతి, భద్రత, వేతనాలు, మౌలిక సదుపాయాలపై సమన్వయ చర్యలు కీలకం. మరి ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?