NTV Telugu Site icon

AP and Karnataka: ఆరు అంశాలపై ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడి..

Pawan Kalyan

Pawan Kalyan

AP and Karnataka: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే సమావేశం అయ్యారు.. ఈ భేటీలో రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. చిత్తూరు, మన్యం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాల పై ఏనుగుల దాడి అంశాలు మా దృష్టికి మీడియా తీసుకొచ్చింది.. పంటపొలాల పై ఏనుగుల దాడి అంశంలో కర్ణాటక నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదు పవన్‌ కల్యాణ్.. ఏపీ, కర్ణాటక మధ్య ఆరు అంశాలపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు..

ఆరు అంశాలు
1. ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి అనే అంశం
2. మావటీలకు కావటీలకు శిక్షణ
3. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు
4. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం
5. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్..
6. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి.

ఇక, ఎకో టూరిజంను అభివృద్ధి చేయడంలో కర్ణాటక తీసుకొచ్చిన విధానాలు ఏపీకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.. రెండు రాష్ట్రాల పీసీసీఎఫ్ లు కలిసి పనిచేస్తాయి.. పార్టీల పరంగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు వేరైనా.. ప్రజల కోసం కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చింది.. వంద కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుకున్నారు.. ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడు నుంచి ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు..