Site icon NTV Telugu

AP IFS Transfers: 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Ap

Ap

ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్రప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్.శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఎస్ శ్రీ శర్వాణన్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్‌గా ఎస్.శ్రీకాంతనాథరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా బి.విజయ కుమార్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్‌గా బీబీఏ కృష్ణమూర్తి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి.జి నరేంద్రన్, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారినిగా ఎం భవిత, తిరుపతి డీఎఫ్‌వో‌గా వి.సాయిబాబా, ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా జి.విఘ్నేశ్‌ అప్పావు, నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ రీజినల్‌ మేనేజర్‌గా పి.వివేక్‌ నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: నేడు బాపట్ల జిల్లాలో పవన్‌కల్యాణ్ టూర్ రద్దు.. కారణమిదే..!

ఇది కూడా చదవండి: Midhun Reddy: నేడు రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న ఎంపీ మిథున్‌రెడ్డి

ఇది కూడా చదవండి: NTR District: దారుణం.. ప్రేమ వ్యవహారం నచ్చక కూతుర్ని చంపిన తండ్రి


Exit mobile version