Gummadi Sandhya Rani: ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం మెగా డీఎస్సీని ప్రకటించాం.. అవసరమైతే గిరిజనల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పనికిమాలిన పనుల వలన ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.. గత ప్రభుత్వ తప్పిదాల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోన్నాం.. ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు.. ఒక్క బటన్ నొక్కడం తప్ప బిల్డింగులు, రోడ్లు, సంక్షేమ పథకాలు లేవని ఆరోపించారు.. ముఖ్యంగా గిరిజనులకు అవసరమైన విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారి సౌకర్యాలపై గత ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు.. గంజాయి పండించేందుకు మాత్రం ప్రోత్సహించారని మండిపడ్డారు.
Read Also: SLBC Tunnel Collapse: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ!
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగును అరికట్టి లక్ష ఎకరాలలో కాఫీ పంట పండించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు మంత్రి సధ్యారాణి.. ఇక్కడ ఏజెన్సీలో పార్టీలు వేరైనా అభివృద్ధే మాకు ముఖ్యం అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం నుండి 550 కోట్లు రూపాయాలు.. ఎన్ఆర్జీఎస్ నుండి 400 కోట్ల రూపాయలతో ఏజెన్సీ రోడ్ల అభివృద్ధి చేస్తున్నాం.. తద్వారా డోలిమోతలను అరికడతామని తెలిపారు.. ఇక, జీసీసీపై ప్రత్యేక దృష్టి.. దళారుల బెడద లేకుండా గిరి రైతుల కోసం ప్రతి మండలానికి జీసీసీ భవనాలు ఏర్పాటు చేస్తాం అన్నారు.. అక్కడి నుంచే పంటలను కొనుగోలు చేసే విధానం. త్వరలోనే జీసీసీని లాభాల బాటలోకి తెస్తామని తెలిపారు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
