Tragedy in Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. గేమ్మెలి శాంతి అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాడేరు సిల్వర్ నగర్‌లో నివసిస్తున్న ఆమెకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. వెంటనే బంధువులు అంబులెన్స్ కోసం కాల్ చేశారు. అయితే, రెండు గంటలు గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో వారు నిరాశ చెందారు.
Read Also: Current wires: ఎవర్రా మీరంతా.. కరెంట్ వైర్లతో ఊయ్యలా ఉగడమేంట్రా..
దీంతో మరింత ఆలస్యం చేస్తే ప్రమాదం జరుగుతుందని భావించి వెంటనే, ప్రైవేట్ ఆటోలో గేమ్మెలి శాంతిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆటోలోనే ప్రసవం జరిగిపోయింది. ఇక, పుట్టిన వెంటనే పసికందు మృతి చెందింది. ఈ ఘటన పాడేరు ఐటీడీఏకు కూతవేటు దూరంలో జరగడం స్థానికులను మరింత కలచి వేసింది. సకాలంలో వైద్యం అందించి ఉండి ఉంటే శిశువును కోల్పోయే పరిస్థితి రాకపోయేది కదా అని బాధిత తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
