Site icon NTV Telugu

Alluri District: వివాదంలో అల్లూరి జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్లు..

Alluri

Alluri

Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్లు వివాదంలో చిక్కుకున్నాయి. మడగడ, వనజంగిలో ఎకో టూరిజం ప్రాజెక్టు కోసం భూములను అటవీశాఖ స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేయగా ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్య జఠిలంగా మారడంతో నేరుగా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఉరితాళ్ళతో గిరిజనులు ఆందోళనకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read Also: Komatireddy Venkat Reddy: జూబ్లీహిల్స్ మాస్ ఏరియా.. మా అభ్యర్థి రౌడీ కాదు..

అయితే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంచు తెరలు కమ్ముకుంటున్నాయి. వింటర్ కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ప్రకృతి ఆహ్లాదాన్ని పరుచుకుంటోంది. ఈ నెలాఖరు నుంచి అరకు పర్యాటక సీజన్‌ స్టార్ట్ అవుతుంది. ఇక్కడకు వచ్చే టూరిస్టుల్లో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న స్పాట్స్ లో పాడేరు సమీపంలోని వంజంగి కొండ, అరకు లోయ దగ్గర మడగడ హిల్ పార్క్ లు. ఇక్కడ నుంచి సూర్యోదయం చూడటం క్రేజ్ గా ఫీల్ అవుతుంటారు పర్యాటకులు. వేకువ జామునే ఎంతో ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఈ మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఇప్పుడు భూమి వివాదం కొనసాగుతుంది. ఈ భూమి మాది అంటే మాదేనంటూ అటవీ, రెవెన్యూ, మడగడ గ్రామస్తులు పోరాట చేస్తున్నారు.

Read Also: Janhvi Kapoor : ‘శారీరక సుఖాలు తప్పుకాదు’ వ్యాఖ్యలతో టాక్‌ షోలో తలపడ్డ స్టార్‌ హీరోయిన్లు..

ఇక, ఐదేళ్ల క్రితం ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ వ్యూ పాయింట్ తొందరలోనే ఎంతో ఫేమస్ అయింది. మడగడ వ్యూ పాయింట్ ను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు సుమారు 600 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ స్పాట్ కి వచ్చే సందర్శకులకు టీ, కాఫీలు, తిను బండరాలు, స్థానిక ఉత్పత్తుల విక్రయం, దింసా నృత్యాలు, గిరిజన వేషధారణ ఇలా పలు రకాలుగా పర్యాటకులను స్థానిక గిరిజనులు అలరిస్తున్నారు. టూరిస్టులను ఆకర్షిస్తూ తద్వారా గిరిజనులు ఉపాధిని పొందుతున్నారు. మడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఇప్పుడు ఆ ప్రదేశం తమదంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారని స్థానిక గిరిజనులు ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేశారు.

Read Also: Nara Rohith : నారా రోహిత్‌- శిరీష.. హల్దీ వేడుక వీడియో చూశారా..!

కాగా, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వంజంగి, మడగడ హిల్స్‌ ప్రస్తుతం వివాదాల్లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు వీటి నిర్వహణ స్థానిక యువత చేతుల్లో ఉండగా, తాజాగా అటవీ శాఖ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో వివాదం ప్రారంభమైంది. కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడతామని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు.

Exit mobile version