Site icon NTV Telugu

Temperatures Drop: ఏజెన్సీలో చలి పంజా.. మంచు ఎఫెక్ట్‌తో రాకపోకలు నిలిపివేత..

Lowest Temperature

Lowest Temperature

Temperatures Drop: అల్లూరి ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది.. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు తీవ్రంగా కురుస్తుండడంతో ఘాట్ రోడ్డులలో భారీ వాహనాలు ట్రావెల్ వాహనాలను రాత్రిపూట రాకపోకలు నిలిపివేసిన అధికారులు.. పాడేరు వంజంగి మేఘాల కొండకు పర్యటకులు భారీగా చేరుకున్నారు.. కొండపై సూర్యోదయం తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు దృష్ట్యా మూడేళ్లలో తొలిసారిగా జి.మాడుగులలో అత్యల్ప మూడు డిగ్రీల నమోదు కాగా, పాడేరు, పెదబయలు, ముంచంగి పుట్టు ప్రాంతాలలో ఐదు డిగ్రీలు, అరకు, మినుములూరు, డుంబ్రిగూడ ప్రాంతాలలో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఇక, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా కొనసాగుతోంది.. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొమురం భీం జిల్లా గిన్నెదరిలో 6.5 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో అర్లీ టి లో 7.5 గా నమోదు అయ్యింది.. నిర్మల్ జిల్లా లో పెంబి లో 7.8 గా.. మంచిర్యాల జిల్లాలో జై పూర్ లో 9 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి..

Read Also: Bengaluru: ‘నేను మీ అన్నను, తండ్రిని’.. ఆటోలో ఒక్క నోటీసుతో మహిళలకు ధైర్యం ఇచ్చిన డ్రైవర్

Exit mobile version