Site icon NTV Telugu

YSRCP Plenary: వైసీపీ ప్లీనరీ.. రెండురోజుల పండుగ

Ysrcp 1

Ysrcp 1

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీ పండుగకు సర్వం సిద్ధం అయింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల10 నిమిషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించనున్నారు. 10:15 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధనలు జరగనున్నాయి. 10:30 గంటలకు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. తరువాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 10:55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఈ ప్రకటనను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేయనున్నారు.

 

https://www.youtube.com/watch?v=FokOcRV3S2Y

ప్లీనరీ వేదిక‌కు వైయ‌స్ఆర్‌ ప్రాంగణంగా నామ‌క‌ర‌ణం
వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైయ‌స్ఆర్ సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదిక‌కు వైయ‌స్ఆర్‌ ప్రాంగణంగా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు ప్లీన‌రీ క‌న్వీన‌ర్ త‌ల‌శీల ర‌ఘురామ్ తెలిపారు. ప్లీన‌రీ ప్రాంగ‌ణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ
మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ దిశానిర్దేశం ఉంటుందన్నారు ఎంపీ మిధున్ రెడ్డి. 2024 టార్గెట్‌గానే ఈ ప్లీనరీ ఉంటుందని తెలిపారు. గత ప్లీనరీ ఇక్కడే చేపట్టాం… అధికారంలోకి వచ్చామని, సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్‌ అవుతుంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు మిథున్‌రెడ్డి. ప్రభుత్వంపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు సవాల్‌ విసిరారు మిథున్‌రెడ్డి.. అసలు ఏ విషయంలో అవినీతి జరిగిందో చంద్రబాబు ఆధారాలు బయటపెట్టగలరా? అంటూ చాలెంజ్ చేశారు.. నామినేషన్ వేసే ప్రతి ఒక్కరూ గెలుస్తాం అనే అనుకుంటారు… చంద్రబాబు వ్యాఖ్యలు కూడా అలాంటివే అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.

Exit mobile version