Site icon NTV Telugu

Sai Prasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అసంతృప్తి వాస్తవమే..!

Sai Prasad Reddy

Sai Prasad Reddy

Sai Prasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి ఉంది.. సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఏకంగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు కాకరేపారు.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే కాగా.. అరేకల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతల్లో అసంతృప్తి వాస్తవమే అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. నాయకుల పట్ల సీఎం వైఎస్‌ జగన్ కి అనుభవం లేదని చెప్పుకొచ్చారు.. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రెండోసారి అవకాశం ఇస్తే పూర్తి అనుభవం వస్తుందని తెలిపారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి..

Read Also: Biryani for One Rupee: రూపాయికే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. మన దగ్గరే..!

కాగా, రెండోసారి సీఎంగా జగన్‌కు అవకాశం కల్పించాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నా.. వైసీపీ నేతల్లో అసంతృప్తి వాస్తవమే నంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చగా మారింది.. మరోవైపు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉంది.. చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్న విషయం విదితమే.. ఈ సమయంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Exit mobile version