NTV Telugu Site icon

Dance in ClassRoom: క్లాస్‌ రూమ్‌లో డ్యాన్స్‌లు.. 8 మంది విద్యార్థులపై చర్యలు

Dance

Dance

క్లాస్‌ రూమ్‌లో సరదాగా ఉండాలి, లెక్చరర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి.. లెక్చరర్‌ లేని సమయంలో.. క్లాస్‌రూమ్‌లో అల్లరి చేయడం ఎక్కడైనా జరిగే తంతుయే కావొచ్చు.. కానీ, అది ఏ మాత్రం శృతిమించకూడదు.. విద్యార్థుల భవిష్యత్‌పై దాని ప్రభావం పడుతోంది.. ఇప్పుడు కాకినాడలో అదే జరిగింది.. క్లాస్‌రూమ్‌లో పిచ్చి డ్యాన్స్‌లు వేయడమే కాదు.. ఆ వీడియోను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.. ఒక్కరు, ఇద్దరు.. ఆ తర్వాత ముగ్గురు.. ఆ తర్వాత పెద్ద గ్యాంగ్‌ ఇలా.. అంతా చేరి పిచ్చి స్టెప్పులు వేసింది.. ఆ వీడియో కాస్తా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో.. ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్‌ చేశారు.. ఆ విషయం తల్లి దండ్రుల వరకు వెళ్లడంతో.. విద్యార్థుల భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?

కాకినాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్లాస్‌ రూమ్‌లో కొందరు విద్యార్థులు.. పిచ్చి చేష్టలు చేశారు.. ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేశారు.. చూసేవారికే ఆ స్టెప్పులు ఇబ్బంది కరంగా ఉన్నాయి.. ఆ స్టెప్పులను వీడియో చిత్రీకరించడంతో.. అది కాస్తా యాజమాన్యం వరకు వెళ్లింది.. దీంతో, 8 మంది విద్యార్థులను సస్పెండ్‌ చేసింది సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం.. అయితే, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థులు.. వారం గడిచినా.. ప్రతీరోజు కాలేజీకి వెళ్లి వస్తూనే ఉన్నారు.. దీనిపై విద్యార్థులను సస్పెండ్ చేసి తొమ్మిది రోజులు అవుతున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు కాలేజ్ కి వెళ్లి తిరిగి వస్తున్నారని, వారు మానసికక్షోభకి గురవుతున్నారని.. విద్యార్థి తల్లి వాయిస్ మెసేజ్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.. పిల్లలు ఏమైనా చేసుకుంటే కాలేజ్ యజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.