ఏపీలో విపక్షాల తీరుపై మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. వరదల సందర్భంగా ప్రభుత్వం తక్షణం స్పందించిందన్నారు. మరోవైపు పోలవరం విషయంలో సఖ్యతగా ఉన్న ఇరు రాష్ట్రాలలో లేని పోని వివాదాలకు తెరలేపటం సరికాదన్నారు. వివాదాలు సఖ్యతగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయటం తప్ప మరో పని కాదు. పోలవరం ఎత్తు పెంపు.. ముంపు గ్రామాలు కలపటం ముగిసి పోయిన అధ్యాయాలు. రాజకీయంగా అక్కడ ఉన్న ప్రతిపక్షాలతో పోటీ పడలేక నీటి రాజకీయాలు తీసుకు రావటం సరికాదు..
ఇవి కేవలం వారి స్వార్థం కోసం మాట్లాడే మాటలు తప్ప వేరొకటి కాదు. మేము ఎక్కడా మా పరిధిని దాటలేదు. వరదల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీఎం జగన్ స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు. చంద్రబాబు పర్యటనలు చేసి నీళ్లల్లో దూకి విన్యాసాలు చేస్తే ప్రయోజనం ఉండదు. మరోవైపు యర్రగొండపాలెం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కు ఒక అనుభవం ఎదురైంది.
తాను చదువుకుంటానని, సీటు కావాలని విష్ణు ప్రియ అనే బాలిక చెప్పగానే చలించిన మంత్రి సురేష్ వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ కు ఫోన్ చేశారు. ఎక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయో చూడాలని కోరారు. దర్శి కేజీబీవీ లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పటంతో వెంటనే బాలిక దర్శికి వెళ్లేందుకు ఖర్చులకు కూడా స్వయంగా మంత్రి కొంత నగదు ఇచ్చి మరుసటి రోజు నుంచే పాఠశాలకు వెళ్ళవచ్చని హామీ ఇచ్చారు. దీనితో బాలిక ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తమ సమస్యను విని తక్షణం స్పందించిన మంత్రికి బాలిక, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
Telangana Weather Update: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు