Site icon NTV Telugu

ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు

Adimulapu Suresh

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై విద్యార్థులలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖలో నాడు-నేడు అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సారి కూడా విద్యార్థులకు నిరాశే మిగిలింది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎలాంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చేశారు. పరీక్షలపై సుప్రీం నోటీసులు విషయం మా దృష్టికి రాలేదని.. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటి నుంచి మా స్టాండ్ ఒక్కటేనని… ఒకవేళ నోటీసులు వస్తే మా స్టాండ్ వినిపిస్తామన్నారు.

Exit mobile version