Site icon NTV Telugu

ఆరోగ్య‌ శాఖ‌ మంత్రి ఏమయ్యారో తెలియడం లేదు : అచ్చెన్నాయుడు సెటైర్లు

అమరావతి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్యాక్సినేషనులో ఏపీ వెనకబడి ఉందని పేర్కొన్నారు.

https://ntvtelugu.com/revanth-reddy-challenge-to-harish-and-ktr/

ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడి లో ముందుంటే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో ముందుందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమ‌ని మండి ప‌డ్డారు. వైద్య శాఖామంత్రి ఆళ్ల నాని రాష్ట్రం లోనే ఉన్నారా..? అసలు ఆరోగ్య‌ శాఖ‌ మంత్రి ఏమయ్యారో తెలియడం లేదని చుర‌క‌లు అంటించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో ఒనగూరే ప్రయోజనం ఏంటి? అని ప్ర‌శ్నించారు.

Exit mobile version