Site icon NTV Telugu

Bezawada Drugs case: బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి

Bezawada Drugs Case

Bezawada Drugs Case

Bezawada Drugs Sase: బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. డ్రగ్స్ సరఫరా చేసిన బెంగుళూరుకు చెందిన శశిని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు.. నిందితుడిని బెంగుళూరు నుంచి బెజవాడకు తీసుకొచ్చారు.. స్కూల్ బ్యాగ్ లో MDMA డ్రగ్స్ ను పెట్టి శశికుమార్‌ బెంగుళూరులో ఆర్టీసీ బస్సులో ఇచ్చినట్టుగా గుర్తించారు.. ఇక, ఈ డ్రగ్స్ ను బెజవాడలో రిసీవర్లుగా ఉన్న హర్ష, సుహాస్, వర ప్రసాద్ ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, బెంగుళూరులో బీటెక్ చదువుతోన్న సమయంలోనే శశి, సుహాస్ మధ్య పరిచయం ఏర్పడిందని.. అది కాస్తా స్నేహంగా మారింది.. ఇప్పుడు డ్రగ్స్‌ సరఫరా వరకు కూడా సాగుతూ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.. బెంగళూరు నుంచి శశి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విజయవాడతో పాటు హైదరాబాద్‌లోనూ గత కొంత కాలంగా సుహస్ అండ్ ఫ్రెండ్స్ డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక, ఈ ముఠా వెనుక ఇంకా ఎవ్వరెవ్వరు ఉన్నారు.. డ్రగ్స్‌ ఎక్కడ నుంచి వస్తున్నాయి.. ఎవరు తయారు చేస్తున్నారు.. శశికుమార్‌ వెనుక ఉన్న గ్యాంగ్‌ ఏంటి? సుహస్‌కు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు ఎంత మందికి డ్రగ్స్‌ సరఫరా చేశాడు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.

Read Also: Arunachal Pradesh: భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం.. చైనా పేరు మార్పులపై అమెరికా..

Exit mobile version