NTV Telugu Site icon

Anantapur: అనంతపురం వైద్యుడికి అరుదైన గౌరవం.. అమెరికాలో ఓ వీధికి అతడి పేరు..

Doctor Jayaram Naidu

Doctor Jayaram Naidu

Anantapur: తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడుకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వైద్య వృత్తిలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఓ వీధికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొత్తలపల్లికి చెందిన జయరాం.. ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్నాడు. అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా ప్రసిద్ధి చెందారు. 1968లో జయరాం అమెరికా వెళ్లాడు.. గుండె సంబంధిత రోగుల కోసం 300 పడకల ఆసుపత్రిని నిర్మించాడు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం టెక్సాస్ మెడికల్ బోర్డు సభ్యునిగా నియమించింది. ఆయన సోదరుడు రాజశేఖర్ నాయుడు కూడా అమెరికాలో స్థిరపడి పారిశ్రామికవేత్తగా మారారు.

Read also: Hyderabad: గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం.. ఈసారి ఎండకు మండాల్సిందే..

వృత్తిరీత్యా వైద్యుడైన జయరాంనాయుడు తన స్వగ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ‘బావికాటి రంగప్ప, లక్ష్మమ్మ మెమోరియల్’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పెద్ద కొట్టాలపల్లిలో వైద్యసేవలు అందించేందుకు 1997లో రూ.20 లక్షలతో ఆస్పత్రిని నిర్మించారు. కొత్త పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక గదులు కూడా నిర్మించారు. శుభకార్యాలు నిర్వహించేందుకు కల్యాణ మండపాన్ని నిర్మించారు. నీటి శుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2015లో హైస్కూల్‌లో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయగా.. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఏటా రూ.30 వేలు నగదు పురస్కారాలు అందజేస్తున్నామని.. అంతే కాకుండా భారీగా ఆర్థికసాయం అందిందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. జయరాం నాయుడుకు తగిన గౌరవం లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Bharat Atta: భారత్ అట్టా పథకం కోసం మూడు లక్షల టన్నుల గోధుమలు