NTV Telugu Site icon

Vande Bharat :సెల్ఫీ తెచ్చిన తంటా.. ఫోటో కోసం రైలెక్కి బుక్కయ్యాడు

Rajamundrumanstuckonvandebharattrainforselfies

Rajamundrumanstuckonvandebharattrainforselfies

Vande Bharat : ‘కొత్తక వింత పాత ఒక రోత’ అన్న సామెత ఈ వార్తకు అతికినట్లు సరిపోతుంది. వారం రోజులుగా వందేభారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు పెడుతోంది. దీంతో ఒక్కసారైనా ట్రైన్ ఎక్కాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే.. ట్రైన్ ఎక్కకపోయినా చూద్దామని చాలా మంది స్టేషన్లకు తరలివస్తున్నారు. లోపలికి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అలా ఫొటో కోసం ఎక్కిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఫలితంగా గంటల పాటు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Sky Walk: ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇబ్బంది ఉండదు.. త్వరలో అందుబాటులోకి స్కై వాక్

విశాఖపట్నం నుంచి వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ వస్తోంది. ఈ మార్గంలో రాజమండ్రిలో ఆగింది. ఆ సమయంలో.. ఓ వ్యక్తి ఫొటోలు తీసుకుందామని ట్రైన్ ఎక్కాడు. ఆయన ఫొటోలు దిగే సంబరంలో ఉండగా.. ఉన్నట్లుండి డోర్స్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యాయి. కిందకు దిగుదామని ఎంత ట్రై చేసినా.. ఫలితం లేకపోయింది. దీంతో సదరు వ్యక్తి రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ట్రైన్‌లోనే ఉండిపోయారు. ట్రైన్ విజయవాడ వచ్చాక దిగి మళ్లీ రాజమండ్రి వెళ్లారు. అయితే.. అతనికి ట్రైన్ సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read Also: Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. మరో 550కోట్లు విడుదల చేసిన సర్కార్

వందేభారత్ రైళ్లు మామూలు ట్రైన్స్ లాంటివి కాదు. ఇందులో ఆధునిక టెక్నాలజీ ఉంది. డోర్స్ ఆటోమెటిక్‌గా మూసుకుపోతాయి. ప్రధాన స్టేషన్లలోనూ 2 నిమిషాలకు మించి ఆగదు. అలా ఎక్కి ఫొటో తీసుకుని, ఇలా వచ్చేద్దామంటే కుదరదు. ఎక్కేవారు దిగే ప్రయాణికులతో ట్రైన్ ద్వారాలు బిజీగా ఉంటాయి. హడావుడిలో ఫొటోల కోసం ఎక్కితే బుక్ అయిపోతారు. అనవసరంగా వందేభారత్ ఎక్కితే, రైల్వే టీసీలు రూ.10వేల దాకా పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంది. అందుకే టికెట్ ఉంటేనే వందేభారత్ ఎక్కాలి. లేదంటే బయట నుంచే చూడాలని రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు.