Site icon NTV Telugu

Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు.. మండిపడిన భక్తులు

Vja

Vja

Vijayawada: విజయవాడలోని ఇంద్రాకీలాద్రి అమ్మవారి ఆలయంలో వెలుగులోకి మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయట పడింది. శుక్రవారం నాడు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.. మహా మండపం కింద 4వ కౌంటర్ దగ్గర ప్రసాదం కౌంటర్ లో పులిహార పొట్లాలు కొనుగోలు చేశారు. అయితే, ప్రసాదం తింటుండగా అందులో ఒక్కసారిగా మేకు రావడంతో సదరు భక్తుడు షాక్ అయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపరిశుభ్ర ప్రాంతాల్లో అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version