Site icon NTV Telugu

Kurnool Crime: కర్నూలులో దారుణం.. జాతరలో అల్లుడ్ని నరికి చంపిన మామ

Kurnool Crime

Kurnool Crime

A Man Killed His Son In Law In A Public Event In Kurnool: ఇంటికి వచ్చిన అల్లుడ్ని అత్తారింటివారు రాజరిక మర్యాదలు చేస్తారు. ఎలాంటి లోటు రానివ్వకుండా.. అప్పుడే పుట్టిన బిడ్డలాగా చూసుకుంటారు. ఒకవేళ అల్లుడు ఏదైనా విషయంలో కోప్పడినా సరే, తామే సర్దుకుపోయి పరిస్థితిని చక్కదిద్దుతారు. అదీ.. మన భారత సంస్కృతిలో ఒక అల్లుడికి ఇచ్చే మర్యాద. కానీ.. కర్నూలులో అందుకు పూర్తి విరుద్ధంగా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతరకి వచ్చిన అల్లుడిని.. స్వయంగా మామే అత్యంత దారుణంగా హతమార్చాడు. జాతరలో అందరి ముందే కత్తితో నరికి చంపేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Pakistan: పాకిస్తాన్‌కు హోండా గుడ్ బై.. కుదేలైన పాక్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ

దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన లింగమయ్య కుమార్తెను సూర్యప్రకాశ్ (23) అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి మధ్య సత్సంబంధాలే ఉండేవి. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఏర్పడింది. కొంతకాలం నుంచి మామ, అల్లుడు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లుడ్ని అంతమొందించాలని మామ లింగమయ్య పెద్ద స్కెచ్ వేశాడు. అందుకు సరైన సమయం కోసి వేచి చూసిన మామ.. జాతరకొచ్చిన తన అల్లుడ్ని చంపేందుకు పథకం రచించాడు. జాతరలో అల్లుడు కనిపించగానే.. లింగమయ్య కత్తులతో విరుచుకుపడ్డాడు. అందరూ చూస్తుండగానే.. కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో.. సూర్యప్రకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

Satish Kaushik: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్ మృతి

నిజానికి.. ఈ జాతర కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా, తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే, ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. లింగమయ్యను అరెస్ట్ చేశారు. అటు.. స్వయంగా తన తండ్రే సూర్యప్రకాశ్‌ని చంపడంతో కుమార్తె కన్నీరుమున్నీరు అవుతోంది. ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Exit mobile version