NTV Telugu Site icon

Job Fraud: ఘరానా మోసం.. రైల్వే ఉద్యోగం పేరుతో కుచ్చుటోపీ

Railway Job Fraud

Railway Job Fraud

A Man Cheated A Boy In The Name Of Railway Job: ప్రైవేట్ కంపెనీలో మంచి స్థాయిలో ఉద్యోగం వస్తుందంటే చాలు.. లక్షలు పెట్టడానికి కూడా సిద్ధమైపోతారు నిరుద్యోగులు. అలాంటిది.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటే ఊరికే ఉంటారా? లెక్క ఎంతైనా పర్లేదు ఇచ్చేస్తామంటూ ముందుకొచ్చేస్తారు. ఇలాంటి వాళ్లకే గాలం వేసి.. కొందరు దుండగులు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరుతో శఠగోపం పెట్టి, వారి వద్ద నుంచి భారీ డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇన్ని మోసాలు వెలుగుచూస్తున్నప్పటికీ.. ప్రజల్లో ఇంకా మార్పులు రావడం లేదు. ఇతరుల మాటల్ని నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఒక వ్యక్తి చేతిలో అలాగే మోసపోయాడు. రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టడంతో.. ముందు, వెనుక చూసుకోకుండా భారీ డబ్బులు అతనికి సమర్పించేసుకున్నాడు. తీరా మోసపోయానని తెలిసి.. పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Priya Prakash Varrier : స్టన్నింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

నంద్యాల జిల్లా డోన్‌కి చెందిన రామ్‌మోహన్ అనే యువకుడు కొంతకాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. అతనికి ఫలితం దక్కట్లేదు. ఈ క్రమంలోనే.. అతనికి అమర్నాథ్, ఆర్మీ రామయ్య అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. రామ్‌మోహన్ ఆ ఇద్దరితో తన గోడు వెళ్లబోసుకోగా.. అతని ఆవేదనని ఎన్‌క్యాష్ చేసుకోవాలని అమర్నాథ్ భావించాడు. రైల్వేలో నీకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే.. అందుకు కొంత డబ్బు అవసరం అవుతుందని చెప్పాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో.. రామ్‌మోహన్ భారీగానే డబ్బులు ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇంకేముంది.. తన గాలంలో చేప చిక్కుందనుకొని, అమర్నాథ్ ఆ యువకుడి వద్ద నుంచి రూ.16 లక్షలు వసూలు చేశాడు. అతనికి నిజంగానే రైల్వే ఉద్యోగం వచ్చినట్టుగా బురిడీ కొట్టించేందుకు.. ఒక ఫేక్ ఐడీ కార్డుని సృష్టించాడు. అంతేకాదు.. అతని అకౌంట్‌లో ఒక నెల జీతం డబ్బులు కూడా వేశాడు.

Actor Manoj : శామీర్ పేట కాల్పుల కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

అయితే.. రామ్‌మోహన్ ఆ తర్వాత అసలు నిజం తెలిసింది. తనకు రైల్వే ఉద్యోగం రాలేదని, తనది ఫేక్ ఐడీ అని గుర్తించాడు. అమర్నాథ్ తనని నట్టేట ముంచాడని భావించి.. బాధితుడు పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో భాగంగా.. అమర్నాథ్‌పై గతంలో కూడా ఓర్వకల్లు పరిధిలో ఇదే తరహా ఆరోపణలు ఉన్నట్టు తేలింది. అంటే.. గతంలో అతడు ఉద్యోగాల పేరుతోనే చాలామందిని మోసం చేసినట్లు వెల్లడైంది. ఓర్వకల్లు పీఎస్‌లో ఒక చీటింగ్ కేసు కూడా నమోదైనట్టు తేలింది.