NTV Telugu Site icon

Lover Attack: ఆకతాయి దుశ్చర్య.. భర్తని వదిలెయ్ నాతో వచ్చెయ్.. కట్ చేస్తే..

Woman Attacked

Woman Attacked

A Man Attacked On Married Woman In Simhachalam: సింహాచలంలో ఓ ఆకతాయి దుశ్చర్యకు పాల్పడ్డాడు. రాత్రి సమయంలో ఓ మహిళపై దాడి చేసి, ఆపై ప్రేమిస్తున్నానంటూ డ్రామాలాడాడు. భర్తని వదిలేసి తనతో వచ్చేయాల్సిందిగా కోరాడు. అవసరమైతే భర్తను కూడా చంపించేస్తానంటూ పేర్కొన్నాడు. చివరికి ఆమె ఆ ఆకతాయి నుంచి తప్పించుకుని, పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సింహాచలంలో ఉంటున్న ఓ వివాహతపై కరోతి చంద్రశేఖర్ అనే ఆకతాయి కొంతకాలం నుంచి కన్నేశాడు. ఆమె అందానికి దాసోహమైన అతగాడు.. ఎలాగైనా ఆమెని తనని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే.. ఆమె మాట్లాడ్డానికి సరైన అవకాశం దొరకలేదు. అందుకోసం వేచి చూసిన అతనికి.. ఆ అవకాశం రానే వచ్చింది. బుధవారం రాత్రి ఆమె ఒంటరిగా ఇంటికి వెళ్లడాన్ని అతడు గమనించాడు.

PM Narendra Modi: 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది.. బురద విసిరితే కమలం అంత వికసిస్తుంది..

అదే అదునుగా భావించి, మొదట ఆ వివాహితపై చాకుతో దాడి చేశాడు చంద్రశేఖర్. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. ఆ వెంటనే అతడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆ మహిళకు షాకిచ్చాడు. నీ భర్తని వదిలి నాతో వచ్చేయమని కోరాడు. నువ్వంటే పడి చస్తానని చెప్పాడు. అవసరమైతే నీ భర్తని చంపించేస్తానని, తన వద్ద ఒక గ్యాంగ్ ఉందని బెదిరించాడు. ఎలాగోలా అతని చెర నుంచి తప్పించుకున్న మహిళ.. వెంటనే కుటుంబసభ్యులతో కలిపి పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఘటనలో గాయపడిన ఆ వివాహితకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చేతిపై గాయాలకు 6 కుట్లు వేశారు. అటు.. చంద్రశేఖర్ గురించి ఆరా తీయగా, అతడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నట్టు తేలింది.

Byreddy Rajasekhar Reddy: అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు

Show comments