NTV Telugu Site icon

Kakinada Oil Factory: ఫ్యాక్టరీలో ఘోరప్రమాదం.. ఊపిరాడక ఏడుగురు మృతి

Kakinada Oil Factory

Kakinada Oil Factory

7 Members Died In Kakinada Oil Factory: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా.. ఏడుగరు కార్మికులు మృతి చెందారు. తొలుత ఓ కార్మికుడు ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేసేందుకు దిగగా.. అతనికి ఊపిరి ఆడలేదు. తనని కాపాడాల్సిందిగా కేకలు వేయడంతో.. అతడ్ని కాపాడేందుకు మరో ఆరుగురు కార్మికులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వాళ్లు కూడా ట్యాంకులో జారిపడి, ఊపిరాడక మృతి చెందారు.

Bollywood: నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ ప్రేమ జంట…

మృతుల్లో పాడేరుకు చెందిన మొచ్చంగి కృష్ణా, మొచ్చంగి నర్సింగ, మొచ్చంగి సాగర్, కురతాడు బంజుబాబు, కుర్ర రామారావు, పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన కట్టమురి జగదీష్, ప్రసాద్ ఉన్నారు. పాడేరుకు చెందిన మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు. ట్యాంకర్‌ను కట్ చేసి.. మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల్లో, వీరి మృతితో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పరిశ్రమ వద్దకు చేరుకొని పరిశీలిస్తున్నారు.

Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్‌లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత

మరోవైపు.. కాకినాడ జిల్లా కలెక్టర్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా.. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15 రోజుల క్రితమే ఈ ఫ్యాక్టరీలో కార్మికులు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Husband Lifts Wife Body: కన్నీళ్లు తెప్పించే హృదయ విదారక ఘటన.. భార్య శవాన్ని మోస్తూ..

Show comments