విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. బెజవాడలో వెలిసిన జగన్మాత.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే అమ్మవారు.. ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులను కాపాడుతున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి.. ఇవాళ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిగా దర్శనం ఇస్తున్నారు.. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి… జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టంగా చెబుతారు.. మూడు శక్తుల్లో ఒక శక్తి అయినా శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుడిని సంహరించినట్టు పునారాలు చెబుతాయి.. ఇవాళ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించడం వలన ఐశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తుంది అని భక్తుల నమ్మకం.
5వ రోజులో భాగంగా శుక్రవారం లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇచ్చారు అమ్మవారు.. అమ్మవారికి కుంకమ, ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. దద్ధోజనం కేసరిబాత్ నైవేద్యంగా సమర్పించారు.. ఇక, ఇవాళ కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా అలంకరించారు.. గులాబీరంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంచడానికి. కదంబం, చక్కర పొంగలితో పాటు క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు.. మరోవైపు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపు ఏడోవ రోజు అమ్మవారు సరస్వతిదేవిగా దర్శనమివ్వనున్నారు.. తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై దర్శనం ఇవ్వనున్నారు దుర్గమ్మ.
