NTV Telugu Site icon

RUDA: రాజమహేంద్రవరంలో మరో 65 గ్రామాలు విలీనం..

Ruda

Ruda

RUDA: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్‌యూడీఏ) పరిధిలోకి మరో 65 గ్రామాలను తీసుకొచ్చింది.. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని నాలుగు మండలాల పరిధిలో ఈ 65 గ్రామాలు ఉన్నాయి.. ఈ మేరకు విలీన ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ శాఖ. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, కె.గన్నవరం, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని 338 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. కొత్తగా విలీనమైన నాలుగు మండలాలతో 3142 చదరపు కిలోమీటర్లకు పెరిగిన రుడా పరిధి.. రామచంద్రాపురంలోని 20, కె.గన్నవరంలోని 24, రాయవరంలోని 7, కపిలేశ్వరపురంలోని 14 గ్రామాలను రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా)లో విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ.

Read Also: Minister Indrakaran reddy: భద్రాద్రి రామ‌య్య సన్నిధిలో ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

మొత్తంగా రాజమహేంద్రవరం నగరానికి చుట్టుపక్కల ఉన్న 65 గ్రామాలను నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.. ఇక, రాజమహేంద్రవరానికి ‘గ్రేటర్’ ట్యాగ్ విషయంలో మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదన ప్రకారం వేమగిరి, కడియంలను ఆర్ఎంసీలో చేర్చవచ్చు అనే చర్చ సాగింది.. వాటితో పాటు సీతానగరం మండలంలోని బొబ్బిలంక, కాటవరం గ్రామాలు కూడా విలీనానికి సంబంధించిన పరిశీలించారు.. 21 గ్రామ పంచాయతీలను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్‌ఎంసి)లో విలీనం చేయాలని గత ప్రభుత్వం డి-నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. విలీనమయ్యే గ్రామాలతో సహా ఆర్‌ఎంసి పరిధిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు రూడా పరిధిలోకి ఏకంగా 65 గ్రామాలను తీసుకొచ్చింది ప్రభుత్వం.