RUDA: రాజమహేంద్రవరంలో మరో 65 గ్రామాలు విలీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RUDA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్‌యూడీఏ) పరిధిలోకి మరో 65 గ్రామాలను తీసుకొచ్చింది.. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని నాలుగు మండలాల పరిధిలో ఈ 65 గ్రామాలు ఉన్నాయి.. ఈ మేరకు విలీన ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, కె.గన్నవరం, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని 338 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. కొత్తగా విలీనమైన నాలుగు మండలాలతో 3142 చదరపు కిలోమీటర్లకు పెరిగిన రుడా పరిధి.. రామచంద్రాపురంలోని 20, కె.గన్నవరంలోని 24, రాయవరంలోని 7, కపిలేశ్వరపురంలోని 14 గ్రామాలను రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా)లో విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ.
Read Also: Minister Indrakaran reddy: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
మొత్తంగా రాజమహేంద్రవరం నగరానికి చుట్టుపక్కల ఉన్న 65 గ్రామాలను నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.. ఇక, రాజమహేంద్రవరానికి ‘గ్రేటర్’ ట్యాగ్ విషయంలో మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదన ప్రకారం వేమగిరి, కడియంలను ఆర్ఎంసీలో చేర్చవచ్చు అనే చర్చ సాగింది.. వాటితో పాటు సీతానగరం మండలంలోని బొబ్బిలంక, కాటవరం గ్రామాలు కూడా విలీనానికి సంబంధించిన పరిశీలించారు.. 21 గ్రామ పంచాయతీలను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసి)లో విలీనం చేయాలని గత ప్రభుత్వం డి-నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. విలీనమయ్యే గ్రామాలతో సహా ఆర్ఎంసి పరిధిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు రూడా పరిధిలోకి ఏకంగా 65 గ్రామాలను తీసుకొచ్చింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?