ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగా నమోదు అవుతూ వస్తుండగా ఈరోజు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,069 శాంపిల్స్ పరీక్షించగా.. 618 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,178 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,81,32,713 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,47,459 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 20,20,835 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,142 కు చేరిందని.. ప్రస్తుతం 12,482 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
ap corona